ఇండస్ట్రీలో అశ్లీలత ఎక్కువైంది :ముఖేష్

170
- Advertisement -

యశ్‌రాజ్‌  ఫిలింస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పఠాన్ సినిమా. ఒక్కసారిగా బాయ్‌కట్‌ దిశగా అడుగులు వేస్తోంది. బేషరమ్ రంగ్ సాంగ్ వల్ల వివాదం మొదలైంది. ఇందులో దీపికా వేషధారణపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్‌ స్టార్ ముఖేష్ ఖన్నా చేరారు.

ఈ సినిమా వివాదంపై స్పందిస్తూ…. బేషరమ్‌ రంగ్‌.. పాట చూడటానికి చాలా అసభ్యకరంగా ఉందన్నారు. మన సినీ ఇండస్ట్రీ అస్తవ్యస్థంగా మారింది. ముఖ్యంగా అశ్లీలత ఎక్కువైంది. నటీనటుల్ని ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తుల్లో చూపించిన ఫిల్మ్‌మేకర్స్‌.. రాబోయే రోజుల్లో బట్టలు లేకుండా చూపిస్తారేమో..? . ఇతరుల ఫీలింగ్స్‌ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతించింది..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల మనోభావాలను నమ్మకాలను ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డుదని అన్నారు.

యువతను తప్పుదారి పట్టించేవిధంగా తప్పుదోవ పట్టించే సినిమాలను సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. ఇదేమీ ఓటీటీ కోసం చేసిన పాట కాదని, సినిమా కోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అసభ్యకరంగా ఉన్నప్పటికీ సెన్సార్‌ ఎలా ఆమోదించింది..? అని ప్రశ్నించారు. జనవరి 25న విడుదలకు సిద్ధం కాగా జాన్‌ అబ్రహం కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి…

ప్రభాస్ ఎపిసోడ్ థియేటర్‌లోకి..?

మహేష్ పై స్పెషల్ వీడియో

లవ్‌టూడే ఓటీటీలోకి ఎప్పుడంటే…

- Advertisement -