- Advertisement -
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భారత్. ఈ మూవీకి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించగా, సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశా పఠానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరకుంది. ముంబై, అబుదాబి, పంజాబ్, లూథియాలోని పలు లోకేషన్లలో చిత్రికరణ జరిపారు. ఈద్ పండగ కానుకగా ఈసినిమాకు విడుదల చేయనున్నారు.
తాజాగా ఈచిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈసినిమాలో భారత్ పాత్రలో సల్మాన్ కనిపించనున్నాడు. భారతదేశ విభజనకి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సల్మాన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో కనిపించడం ప్రేక్షకులను అలరిస్తోంది. టబు, టైగర్ ష్రాఫ్, ఆసిఫ్ షేక్ తదితరులు చిత్రంలో పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Advertisement -