బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్‌గా మారింది. సెలబ్రిటీల పెళ్లిళ్లు ఈ మధ్య పెటాకులు అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం అయిపోయింది. చిన్న చిన్న విషయాలకు మనస్పర్థలు.. వెంటనే బ్రేక్ అప్ లు.. ఆ వెంటనే డివోర్స్ లు.. ఇది ప్రస్తుత సెలబ్రిటీల పెళ్లిళ్ల పరిస్థితి. ఐతే, ఈ విడాకుల లిస్ట్ లోకి స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరడమే ఇప్పుడు హాట్ టాపిక్. వ్యక్తిగతంగా వరుణ్ ధావన్ కి మంచి పేరు ఉంది. మంచి పద్దతి కలిగిన వ్యక్తి అని, స్త్రీలను బాగా గౌరవిస్తాడు అని అతనికి పేరు.
మరి ఇలాంటి వరుణ్ ధావన్ కూడా విడాకుల దిశగా తన ప్రయాణం సాగించడం నిజంగా షాకింగ్ విషయమే. కారణం.. వరుణ్ ధావన్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెను ఐదేళ్లు పాటు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇన్నేళ్ల ప్రేమ తర్వాత కూడా వరుణ్ ధావన్ తన భార్య నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం చాలామందికి మింగుడు పడటం లేదు. తమ ప్రేమ, దాంపత్య బంధాలకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియా ద్వారానే సెలబ్రిటీలు అప్ డేట్లు ఇస్తుంటారు.
Also Read: ట్యూటర్ ను పెట్టుకొని మరీ..
విడాకులు లాంటి విషయాల్లో అయితే ఇన్ డైరెక్టు తతంగాలే ఎక్కువ నడుస్తాయి. కానీ వరుణ్ ధావన్, నటాషా దలాల్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే.. బాలీవుడ్ మీడియాతో పాటు వరుణ్ ధావన్ సన్నిహితులు కూడా ఈ వార్త నిజమే అంటూ తేల్చేశారు. ఏది ఏమైనా గతంతో పోలిస్తే విడిపోయే స్టార్ దంపతుల సంఖ్య బాగా పెరిగింది. అయినా సినిమా వాళ్ళ విడాకులు నేటి సమాజంలో సహజమైన అంశం అయిపోయింది.
Also Read: రేటు పెంచేసిన పవిత్ర