బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై పలువురు సినీ సెలబ్రెటీలు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో కొంత మంది పెద్దల ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. కొంత మంది బాలీవుడ్ పేరుమోసిన నటులు బాలీవుడ్ ను తమ గుప్పిట్లో ఉంచుకున్నారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సంగీత పరిశ్రమలో మరిన్ని ఆత్మహత్యలు చూస్తామని సంచలన కామెంట్స్ చేశాడు.
సోనూ నిగమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంగీత పరిశ్రమలోను ఉన్న మాఫియా యువ, ఔత్సాహిక గాయకులతో పాటు లిరిసిస్ట్స్, కంపోజర్స్ జీవితాలని నాశనం చేస్తుంది. కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని, సినీ రంగం కంటే కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియాలు ఉన్నాయన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో తమకు జరిగిన అన్యాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు పలువురు సినీ సెలబ్రెటీలు.