బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌ఖాన్ వరల్డ్ రిచెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. 2019 వరకూ టాప్ 13లో ఉన్న షారూఖ్ ఖాన్ 2019 తర్వాత ఏకంగా ఆరవ స్థానంలోకి వచ్చేశారు. టామ్ క్రూజ్, జాకీ చాన్, జార్జ్ క్లూనీ లాంటి హాలీవుడ్ స్టార్‌లు ఉన్న…షారూఖ్‌ఖాన్ ఏకంగా 6300కోట్లతో వరల్డ్‌లో నాలగవ స్థానంలో ఉన్నారు.
మొదటి స్థానంలో అమెరికన్ కమెడియన్ జెర్రీ సీన్ ఫెల్డ్ 800 కోట్ల రూపాయలతో ఫస్ట్ ప్లేస్ లోఉన్నారు. టైలర్ పెర్రీ కూడా 1 బిలియన్ డాలర్స్ తో సెకండ్ ప్లేస్ లోఉన్నారు. ఇక ద రాక్ డ్వైన్ జాన్సన్ మూడవ స్థానంలో ఉన్నారు. హాలీవుడ్ సూపర్ హ్యాండ్సమ్ హీరో టామ్ క్రూజ్ 5 వేల కోట్ల రూపాయలతో టాప్ 5 రిచెస్ట్ యాక్టర్ గా నిలిచారు. జాకీ చాన్ 4 వేలకోట్ల రూపాయలతో ఆరోస్థానం, జార్జ్ క్లూనీ కూడా 4 వేలకోట్ల సంపదతో 7వ స్థానంలో ఉన్నారు.
షారూఖ్‌ఖాన్ గత 5యేళ్లుగా ఒక్క సినిమా కూడా తీయలేదు. కానీ స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేగాదు సంపద విషయంలో కూడా హాలీవుడ్ స్టార్‌లను కాదని ముందుకు దూసుకెళ్తున్నారు. షారూఖ్ ప్రస్తుతం దాదాపు 14 బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. బిగ్ బాస్కెట్, బైజూస్ యాప్, బాత్రూమ్ ఎసెన్షియల్స్, పెయింట్స్, కార్స్ , బ్యాంక్స్ ..ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ లో ఉన్న బ్రాండ్స్ కి కమర్షియల్ గా ప్రమోషన్ చేస్తున్నాడు. తన ప్రొడక్షన్ హౌజ్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మనీ జనరేట్ చేస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం షారూఖ్ ఖాన్ సగటు సంవత్సర ఆదాయం కనీసం 300కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది.
కోల్ కతా నైట్ రైడర్స్ పేరుతో ఐపీఎల్‌లో ఓ టీమ్ మరియు వెస్ట్ ఇండీస్ లో డొమెస్టిక్ టీ 20లో టి అండ్ టి నైట్ రైడర్స్ పేరుతో టీమ్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఇన్ని మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న బాద్‌షా ప్రపంచంలో టాప్ 4 రిచేస్ట్ యాక్టర్‌గా నిలిచారు.
ఇవి కూడా చదవండి…