‘రా.వన్’, ‘చెన్నయ్ ఎక్స్ ప్రెస్’, ‘దిల్ వాలే’ వంటి హిందీ చిత్రాలను నిర్మించిన బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరీం మొరానీ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయాడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కరీం మొరానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలు విషయం ఏంటంటే… సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి 2015లో బీబీఎం విద్యార్థినిని ట్రాప్ చేశాడు. అదే ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందిచ్చి రేప్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన అభ్యంతరకర ఫోటోలను అడ్డం పెట్టుకుని ఆరు నెలలపాటు ముంబై, హైదరాబాదుల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా కరీం మొరానీకి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా సంబంధాలు ఉన్నాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమెను చంపేస్తానని బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టు తెలిపింది.
దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించగా, బెయిల్ పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్‌ను రద్దు చేసింది, వెంటనే అతను కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
#UPDATE Hyderabad: Film Producer Kareem Morani surrenders before Hayat Nagar Police in rape case pic.twitter.com/21usAmD9OT
— ANI (@ANI) September 23, 2017