నైపుణ్యం ఉంటేనే సక్సెస్!

6
- Advertisement -

నటుడు బోమన్ ఇరానీ 44వ ఏట సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అలాగే, 65వ ఏట తన తొలి దర్శకత్వ చిత్రం ‘మేహతా బాయ్స్’ ను తెరకెక్కించారు. ఇక తన బర్త్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుల విజయాలు బాలీవుడ్‌లో అవకాశాలపై ఆధారపడి ఉంటాయని భావనను తీవ్రంగా వ్యతిరేకించారు.

పరిశ్రమలో ఎప్పుడు ఎదుగుతామో మన శ్రమ, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. బాలీవుడ్ వల్ల ఎవరు లేట్ బ్లూమర్‌ అవరు. భారతీయ సినీ పరిశ్రమ వల్ల కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సిన విషయం. కలలతో రావడం మంచిదే, కానీ అదే సమయంలో నైపుణ్యం ఉంటేనే సక్సెస్ సాధిస్తామని తెలిపారు.

బోమన్ ఇరానీ విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ‘3 ఇడియట్స్’ సినిమాలోని వైరస్ పాత్ర నుంచి *‘ఖోస్లా కా ఘోస్లా’*లోని వ్యాపారి కిషన్ ఖురానా పాత్ర వరకు ఆయన వైవిధ్యమైన నటనా ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. నటుడిగా ఎదగాలనుకుంటే, క్రాఫ్ట్ (నైపుణ్యం) మీద పనిచేయండి. ప్రయత్నించాను, ఆడిషన్స్‌కు వెళ్లాను అనే మాటలతో సరిపోదు. ఆడిషన్‌కు మీరు ఏం తీసుకెళ్లారు? మీరు ఎటువంటి ట్రైనింగ్ చేశారు? డ్రామా స్కూల్‌కు వెళ్లకపోయినా సరే, స్వయంగా ఏం నేర్చుకున్నారు? మీరు rehearsal చేశారు? మీరు కేవలం అందంగా కనిపిస్తే సరిపోతుందని అనుకుంటే, మీకు నిరాశ తప్పదు.
అదృష్టాన్ని మీరే సృష్టించుకోండి. బాలీవుడ్ మీ కోసం ఏం చేస్తుందని ఆశ పెట్టుకోకండి అని సూచించారు.

బోమన్ ఇరానీ ..‘డిటెక్టివ్ షేర్దిల్’ – జీ5లో జూన్ 20న విడుదల కానుంది. ఇందులో దిల్జీత్ దోసాంఝ్, డయానా పెంటీ, బనితా సందు, రత్నా పాఠక్ షా తదితరులు నటిస్తున్నారు. బోమన్ ఇరానీ ఇందులో హత్యకు గురైన వ్యాపారి పాత్రలో కనిపించనున్నారు. దిల్జీత్ దోసాంఝ్ పాత్ర ఆ హత్యను దర్యాప్తు చేస్తుంది.

‘తన్వీ ది గ్రేట్’ – అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కొత్త నటిగా శుభాంగి దత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కూడా బోమన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -