వీడియోలు..ఇజ్రాయెల్ ఆస్పత్రి ధ్వంసం!

7
- Advertisement -

ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైంది. ముఖ్యంగా ప్రధాన నగరాలే టార్గెట్‌గా దాడులు జరుగుతుండగా తాజాగా ఇవాళ ఉదయం దక్షిణ ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది.ఈ దాడిలో బీర్ షెబాలోని సోరోకా మెడికల్ సెంటర్‌కు భారీ నష్టం వాటిలైంది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. భవనం అవశేషాలకింద చిక్కుకున్నవారున్నారని అనుమానిస్తున్నారు.

సోరోకా మెడికల్ సెంటర్ అనేది దక్షిణ ఇజ్రాయెల్‌లో అతిపెద్ద ఆసుపత్రి. దాడి అనంతరం దట్టమైన పొగతో ఆ ప్రాంతం నిండి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.ఇప్పటి వరకు మరణాలపై ఎలాంటి అధికారిక సమాచారం వెలుబడలేదు.

సోరోకా ఆసుపత్రిలో 1,000కిపైగా పడకలు ఉన్నాయి. ఇది దక్షిణ ఇజ్రాయెల్‌లోని దాదాపు 10 లక్షల ప్రజలకు వైద్యం అందిస్తోంది.ఈ దాడి ముందు, ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది.

 

Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -