బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా , ఆమెరికా సింగర్ నిక్ జోనస్ లు ఇటివలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి రిసెష్షన్ తాజ్ ప్యాలెస్ హోటల్ లో వైభవంగా జరిగింది. బంధువులు, మిత్రులు, పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ కు తరలివచ్చారు. ప్రియాంక చోప్రా డ్రెస్ ఈ రిసెప్షన్ కి హైలెట్ గా నిలిచింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.నూతన వధూవరులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈసందర్భంగా మోదీ వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఈఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో టీమిండియా కెప్టెన్ కోహ్లి, అనుష్క శర్మ వివాహ విందుకి మోదీ అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. సిల్వర్ కలర్ లెహెంగాలో ప్రియాంక, బ్లాక్ కోట్లో నిక్.. కలర్ఫుల్గా కనిపించారు.నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకు ప్రియానిక్‌ల వివాహం జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు.