ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్. బాహుబలి చిత్రం తర్వాత రాజమౌళి ఈచిత్రాన్ని చిత్రకరించడంతో ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమూవీ ఇటివలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రాజమౌళి కుమారుడి వివాహంతో షూటింగ్ కు కొంచెం బ్రేక్ పడింది. మరికొద్ది రోజుల్లోనే సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు చిత్రయూనిట్.
ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ లపై ఇంకా ఎటువంటి ప్రకటన తెలపలేదు చిత్రబృందం. సోషల్ మీడియాలలో మాత్రం ముగ్గురు హీరోయిన్లను ఈచిత్రంలో తీసుకొనున్నారని ప్రచారం జరుగుతుంది. అందులో కీర్తి సురేష్, కైరా అద్వాని, రష్మీక మందన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను రాజమౌళి సంప్రదించినట్టుగా సమాచారం. త్వరలోనే విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది.