సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ కామన్ అయిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏదైనా బ్రేకప్ మాత్రం కామనే. మంచిగా ఉన్నంత కాలం జీవితం సాఫీగా ఉంటుంది.. ఏదైనా తేడా వస్తే ఏ మాత్రం ఆలోచించకుండా ప్రేమ,పెళ్లికి బ్రేకప్ చెప్పుకోవడం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఇలా మనస్పర్థలు వచ్చి విడిపోయిన జంటలు, విడిపోయే ముందు చెల్లించిన భరణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పదేళ్ళ పాటు కలిసున్న హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ వీరి బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారు. 2014లో వీరు విడాకులు తీసుకోగా రూ.400 కోట్లు భరణంగా చెల్లించాలని సుసాన్ ఖాన్ డిమాండ్ చేయగా హృతిక్ రోషన్ రూ.380 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
ఈ బాటలోనే పయనించాడు సైఫ్ అలీఖాన్. 1991లో అమృతా సింగ్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు. 13 ఏళ్ల తర్వాత 2004లో సైఫ్ అలీఖాన్, అమృతకు విడాకులు ఇచ్చారు. ఇందు కోసం భరణంగా తన ఆస్తిలో సగభాగం అమృత పేర రాసిచ్చాడట.
టాప్ హీరో సంజయ్ దత్ కూడా భారీ భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నారు. నటి రిచా శర్మను 1987లో వివాహం చేసుకున్న సంజయ్… 1996లో బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోగా తర్వాత రెండేళ్లకు 1998లో సంజయ్ రియా పిళ్లైని పెళ్లి చేసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అపార్ట్‌మెంట్, ఖరీదైన కారు భరణంగా ఇచ్చారు. నటుడు ప్రభుదేవా సైతం తన భార్య రమాలత్‌కు 2011లో దాదాపు రూ. 25 కోట్లు భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నారని టాక్. యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన మొదటి భార్య పాయల్ ఖన్నాకు రూ.100 కోట్ల వరకు భరణం చెల్లించినట్లు సమాచారం. తాజాగా అమీర్ ఖాన్ సైతం రీనా దత్తాకు కోట్ల రూపాయలు భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నారట.