బాలీవుడ్ బబ్లీ బ్యూటీ సోనాక్షి సిన్హా వ్యక్తిగత జీవితంపై నెటిజన్లకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎప్పటినుంచో సోనాక్షి సిన్హా ప్రేమ, సహజీవనం, పెళ్లి తదితర అంశాలపై ఎప్పటికప్పుడు మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే 35 ఏళ్ల ఈ భారీ ముద్దుగుమ్మకి పెళ్లి అంటూ కొన్ని రూమర్లు వైరల్ అవుతున్నాయి. వైరల్ అయితే ఓకే, కానీ ఈ వార్తలు హిందీ సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
ఎంతైనా, చూడ చక్కటి సౌందర్యం, అందమైన ముఖ వర్చస్సుతో పాటు కలువ కళ్ళు… మొత్తానికి సోనాక్షి సిన్హా మంచి అందగత్తె. మరి సోనాక్షి సిన్హా త్వరలో ఏడడుగులు నడవనుందనే వార్తలు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. ముంబైకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతోందని, వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి జరగనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
ఇది ప్రేమ వివాహమని, అయితే, ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సోనాక్షి సిన్హా పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, అప్పట్లో ఆ ప్రచారాన్ని సోనాక్షి సిన్హా ఖండించారు. ఇటీవల 35వ ఏడాదిలోకి సోనాక్షి సిన్హా అడుగు పెట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. ఏది ఏమైనా నార్త్ లో అగ్రహీరోల సరసన నటించి మెప్పించిన సోనాక్షి సిన్హా అంటే.. ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది.
ఇవి కూడా చదవండి…