బాలీవుడ్ హీరోయిన్ తో ప్రభాస్ డేటింగ్ ?

246
- Advertisement -

ప్రభాస్ ప్రేమ , పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఏది నిజం కాకుండా పోయింది. తాజాగా ప్రభాస్ పై కొత్త న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడన్నది ఆ న్యూస్. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కృతి ప్రభాస్ కి హీరోయిన్ గా సీత పాత్రలో నటిస్తుంది. తాజాగా వీరిద్దరూ క్లూజ్ గా మూవ్ అవుతున్నారని ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

బాహుబలి , బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ ఎవరూ అందుకోలేని బిగ్గెస్ట్ హిట్ అందుకొని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. వరుసగా బడా సినిమాలు చేస్తూ వంద కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. సాహో తర్వాత ప్రభాస్ బీ టౌన్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అక్కడ స్టార్స్ తో సినిమాలు చేస్తూ వాళ్ళతో మంచి ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా కృతి తో కూడా క్లోజ్ అయ్యాడు ప్రభాస్.

తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి కృతి ఓ బాలీవుడ్ షో లో పాల్గొంది. అందులో వరుణ్ కృతి మనసులో ఓ స్పెషల్ పర్సన్ ఉన్నాడని ఆయన ఇప్పుడు ముంబై లేరని, దీపిక తో షూటింగ్ లో ఉన్నాడని సరదగా అన్నాడు. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇటివలే మీ ఫేవరేట్ హీరో ఎవరంటే ? టక్కున ప్రభాస్ పేరు చెప్పేసింది కృతి. ఈ రెండు విషయాలు పట్టుకొని ప్రభాస్ -కృతి మధ్య ప్రేమాయణం అల్లెస్తున్నారు నెటిజన్లు. కొందరైతే త్వరలోనే కృతితో ప్రభాస్ పెళ్లి అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. మరి ఈ న్యూస్ పై ప్రభాస్ , కృతి సనన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

ఆర్సీ 15 నెలలో పన్నెండు రోజులే

ఈ వారం ఓటీటీ కంటెంట్ పరిస్థితేంటి ?

ఏరియల్ వ్యూ ద్వారా ప‌వ‌ర్ ప్లాంట్‌ను పరిశీలించిన సీఎం

- Advertisement -