Prabhas:సలార్ 2లో బాలీవుడ్ భామ?

27
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ చిత్రం ‘సలార్’. విడుదలైన రోజునుంచే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తుండడంతో మూవీ మేకర్స్.. ఈ సినిమాను స్పానిష్ భాషలో రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విదేశీ భాషలో కూడా సలార్ విడుదల కాబోతుంది. మరోపక్క బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సలార్‌ దెబ్బకు, ఇప్పుడు సలార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. కియారా అద్వానీ పాత్ర సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటుందని.. అలాగే ఆమె పై ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

సలార్ పార్ట్ 2 కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. 2025లో సలార్ ప్రేక్షకుల ముందుకురాబోతుంది.

Also Read:కాజల్ అగర్వాల్.. “సత్యభామ” రిలీజ్ డేట్

- Advertisement -