ఆస్పత్రిలో చేరిన నటుడు గోవిందా

4
- Advertisement -

బాలీవుడు నటుడు గోవిందా ముంబై-జుహులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం అర్ధరాత్రి స్పృహ కోల్పోయారని, చికిత్స మేరకు ఆస్పత్రిలో చేర్పించినట్లు గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం గోవిందా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన ఆయన ఇంట్లోనే చోటుచేసుకుంది. గోవింద కొంతకాలంగా అస్వస్థతగా ఉన్నారని, అందుకే వైద్య సిబ్బంది అత్యవసర చికిత్స అందించారని ఆయన న్యాయవాది బిందల్ తెలిపారు. ప్రస్తుతం గోవింద పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. న్యూరాలజీ విభాగం నివేదికలు అందిన తరువాత తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read:గత వైభవం..బ్లాక్ బస్టర్ కావాలి: నాగ్

గోవిందకు ఇది రెండేళ్లలో రెండోసారి ఆసుపత్రిలో చేరడం. గత సంవత్సరం అక్టోబరులో ఆయనకు తుపాకీ ప్రమాదం జరిగింది. అప్పట్లో ఆయన కాలికి గన్‌షాట్ గాయం కావడంతో చికిత్స పొందారు.

- Advertisement -