చిరుతో బాబీ..మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు!

4
- Advertisement -

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తుండగా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ బాబీ కోల్లి మరోసారి మెగాస్టార్ చిరంజీవితో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను ఇప్పటికీ అధికారికంగా ప్రకటించనప్పటికీ, సెప్టెంబర్ 2025లో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

ఈ భారీ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మారిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా చిరంజీవికి ఓ ప్రాజెక్ట్ ఉంది.

అలాగే చిరు నటించిన విశ్వంభర విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల కథను వింటున్నారు మెగాస్టార్.

Also Read:తెలంగాణ కేబినెట్ భేటీ..

- Advertisement -