- Advertisement -
లిబియాలో పడవ బోల్తా పడగా 42 మంది వలసదారులు గల్లంతు అయ్యారు. లిబియా తీరానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైనవారంతా మృతి చెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సముద్రం మధ్యలో మర పడవ ఇంజన్ విఫలం కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఏడుగురు బయటపడగా.. ఆరు రోజుల వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉండిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో, ఈ ఏడాదిలోనే 1,000 మందికి పైగా వలసదారులు మధ్యధరా సముద్రంలో ప్రాణాలు కోల్పోయారు.
పడవలో 47 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. నవంబర్ 3న లిబియా రాజధాని ట్రిపోలీకి పశ్చిమాన ఉన్న జువారా తీర నుంచి బయలుదేరిన పడవ, ఆరు గంటల తర్వాత భారీ అలల కారణంగా ఇంజిన్ పని చేయకపోవడంతో మునిగిపోయింది. పడవ తలకిందులై, అందరూ సముద్రంలో పడిపోయారని తెలిపింది.
Also Read:ప్రజాకవి కాళోజీ..వర్థంతి
- Advertisement -

