- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పదవ తరగతి పరీక్షలు 6పేపర్లుగా నిర్థారించిన ప్రభుత్వం…తాజాగా ఇంటర్మీడియట్‌ను 100శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం సిలబస్‌కు సంబంధించిన నమూనా ప్రశ్నాపత్రాలు ఇంటర్ వెబ్సైట్లో పొందుపర్చారు.
కొవిడ్ వల్ల గత రెండేళ్లు ఇంటర్ పరీక్షలు 70శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
- Advertisement -