BMC Polls:బీజేపీ – షిండే సీట్ల సంఖ్య ఖరారు!

4
- Advertisement -

2026లో జరగనున్న బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల కోసం బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య సీట్ల పంపకం ఖరారైంది.. మహాయుతి భాగస్వాములు రూపొందించిన ఫార్ములా ప్రకారం, కాషాయ పార్టీ అయిన బీజేపీ 140 సీట్లలో పోటీ చేయనుండగా, షిండే శివసేన 87 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దించనుంది.

మొన్నటి రోజులుగా జరిగిన విస్తృత చర్చలు, సమావేశాల అనంతరం ఈ సీటు షేరింగ్ ఒప్పందం ఖరారైంది. బీఎంసీ ఎన్నికల పోలింగ్ జనవరి 15న జరగనుండగా, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలతో పాటు ఈ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు జనవరి 16న జరుగుతుంది.

ఇటీవల రెండు మిత్రపక్షాల మధ్య అసంతృప్తి ఉందన్న వార్తలు వినిపించినప్పటికీ, బీజేపీ మరియు షిండే శివసేన ఆ కథనాలను ఖండించాయి. ఇప్పటికే 200 సీట్లకు సంబంధించిన సీటు పంచకాన్ని ఖరారు చేసినట్లు, మిగిలిన 27 సీట్లపై చర్చలు కొనసాగుతున్నాయని వర్గాలు తెలిపాయి.

అసంతృప్తి వార్తల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ షిండే శివసేనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. బీజేపీ నేతలు షిండే పార్టీపై బహిరంగ విమర్శలు చేయొద్దని ఆయన ఆదేశించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ..బీజేపీ, శివసేన ఐక్యంగా ఉన్నాయి. అన్నీ సజావుగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా కూటమిని ప్రకటించే అవసరం లేదు అన్నారు.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా భాగస్వామిగా ఉన్న మహాయుతి, ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర్ పంచాయత్ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. డిసెంబర్ 2, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగగా, ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.ఎస్ఈసీ ప్రకారం, మున్సిపల్ ప్రెసిడెంట్ పోస్టుల్లో బీజేపీ 117, శివసేన 53, ఎన్సీపీ 37, కాంగ్రెస్ 28, శివసేన (యూబీటీ) 9, ఎన్సీపీ (ఎస్‌పీ) 7 స్థానాలు గెలుచుకున్నాయి. స్వతంత్రులు 5, గుర్తింపు లేని పార్టీలు 28 స్థానాలు సాధించాయి.

Also Read:‘గత వైభవం’..రిలీజ్ డేట్

 

- Advertisement -