మెడికల్ విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

4
- Advertisement -

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బి.ఎల్.ఆర్ (BLR) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్ (MBBS) విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్ గారు విద్యార్థులకు చెక్కులను అందజేస్తూ, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సమాజంలోని పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఏటా అనేక మంది విద్యార్థులకు విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సాయం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న లక్ష్మారెడ్డి గారి సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయమని కేటీఆర్ కొనియాడారు.

బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ‘బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజుల భారం కలగకుండా చూస్తామని, వారు భవిష్యత్తులో గొప్ప వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.

Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం

ఈ కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది వైద్య విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు, తమ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి మరియు తమకు శుభాకంక్షలు తెలిపిన కేటీఆర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -