జై లవకుశ స్టిల్స్ లీక్‌..!

316
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ ‘ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎంత పెద్ద స్టార్‌ హీరోల సినిమాలైనా..లీక్‌ అవడం ఇప్పుడు కామన్‌ అయిపోయింది.

దాంతో భారీ చిత్రాలకు లీకుల బెడద తప్పటం లేదు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ కూడా లీకు వీరుల బారిన పడింది.

 Blow for NTR's Jai Lava Kusa as working stills from the film leak ...

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో యూనిట్ సభ్యులతో పాటు, అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు. అవి లీక్‌ అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఆ ఫోటోలు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కు సంబంధించినవిగా తెలుస్తున్నాయి.

ఈ స్టిల్స్ కువైట్ నుంచి లీక్ అయినట్టుగా భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్ ఎడిటర్ గా పనిచేస్తున్న గణేష్ అనే వ్యక్తి లీక్ చేశాడని అనుమానిస్తున్నారు. గణేష్ తన ఫ్రెండ్స్ ద్వారా కువైట్ నుంచి ఈ ఫోటోలు పోస్ట్ చేయించాడు.

Blow for NTR's Jai Lava Kusa as working stills from the film leak ...

ఇప్పటికే చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను షేర్ చెయ్యొద్దని సైబర్ క్రైం పోలీసులు నెటిజన్లకు విజ్ఞప్తి కూడా చేసింది.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా …కేవలం స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా.. లేక సీన్స్ కూడా లీక్ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -