తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, అమెరికాలో డెలావేర్ రాష్ట్రంలో మూడవ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తోటి వారి ప్రాణాలను కాపాడే భాగంలో బీఆర్ఎస్ అభిమానులు ముందు వరుసలో ఉండి తమ రక్తాన్ని దానం చేసి తోటి వారి ప్రాణాలని కాపాడారు. తదనంతరం కేసీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ, కేక్ కట్ చేసి పండ్లు దానం చేశారు. రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అధ్యక్షతన కేక్ కట్ చేశారు.ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంట ఎలా ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని రాధారపు సతీష్ కుమార్ తెలిపారు. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా నిరుపేద జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపి రైతుబంధు, రుణమాఫీ కోసం రైతుల ఖాతాల్లో రూ. లక్ష కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన ఏకైక నాయకుడు కేసీఆర్. ప్రజాపాలన అంటే నిర్బంధాల పాలనా అయింది. పాలన చేతగాక, కేవలం ప్రజల దృష్టి మార్చేందుకు బీఆర్‌ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతుంటే మరోవైపు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని తెలిపారు.
Also Read:కేసీఆర్..జై తెలంగాణ యుద్ధ నినాదం
ప్రజాపాలన అంటే నిర్బంధాల పాలన అయింది. తెలంగాణ చరిత్ర మార్చిన ఉద్యమ నాయకులు కేసీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే భేషరతుగా వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము, లేకుంటే తెలంగాణ సమాజమే తగిన గుణపాఠం చెబుతుంది. కుట్ర పూరితంగా కులగణన చేశారు. కులగణనను మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా వున్నారు. కేసీఆర్ లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.