ముక్కు లోనుంచి రక్తం కారడం అనేది చాలమందిలో చూస్తుంటాము. ముఖ్యంగా పదేళ్ళ లోపు ఉన్న పిల్లలలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇంకా కొందరిలో అయితే 20 ఏళ్ల వయసు వరకు కూడా ఈ సమస్య వేదిస్తూ ఉంటుంది. ముక్కు లో నుంచి రక్తం ఒక సాధారణ సమస్య. ముక్కు లోని సున్నితమైన నాళాలు వ్యాకోచనికి లేదా సంకోచనికి గురైనప్పుడు లేదా రక్త నాళాలకు చిన్న దెబ్బ తగిలినప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతుంది. ఇంకా శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న లేదా వాతావరణంలో మార్పుల కారణంగా కూడా ముక్కు నుంచి రక్తం వస్తుంది. అయితే ఈ సమస్య వేసవిలో మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో ముక్కు లో నుంచి రక్తం రాగానే భయాందోళనకు గురౌతుంటారు చాలమంది. అయితే అలాంటి సమయంలో భయపడవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదొక సాధారణ సమస్య అయినందున కనీసపు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:Pushpa 2: నాలుగు రోజుల్లో రూ.829 కోట్లు
ముక్కు నుంచి రక్తం వచ్చేటప్పుడు.. ముక్కు యొక్క రంద్రాలను గట్టిగా పట్టి ఉంచాలి. ఆ సమయంలో నోటితో శ్వాస తీసుకోవాలి. రక్తస్రావం ఆగే వరకు ఆ పట్టి ఉంచిన ముక్కు రంద్రాలను తెరవకూడదు. చల్లటి నీటిలో తడిపిన గుడ్డతో ముక్కుపై సున్నితంగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తస్రావం త్వరగా ఆగిపోతుంది. ఇక వంటింటి చిట్కాలు కూడా ముక్కు నుంచి రక్తం కారడాన్ని సమర్థవంతంగా నివారిస్తాయి. ఉల్లిపాయ, కొత్తిమీర, తులసి ఆకులు, నిమ్మ ఆకులు వంటివి ఈ సమస్యను ఎదుర్కోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
ఈ సమస్యకు తులసి ఆకులు దివ్య ఔశదంలా పని చేస్తాయి. తులసి ఆకుల యొక్క రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కలు ముక్కు రంధ్రాలలో వేయడం ద్వారా ముక్కు నుంచి రక్తస్రావం తగ్గుతుంది. ఎందుకంటే తులసిలో ఉండే ఔషధ గుణాలు యాంటీ బయోటిక్ లా పని చేస్తాయి కాబట్టి ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది. కొత్తిమీర కూడా ఇందుకు చక్కగా ఉపయోగ పడుతుంది. కొత్తిమీరను మెత్తగా నలిపి వాసన చూడడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.. ఇక ఉల్లిపాయను కూడా ముక్కలుగా చేసి వాటి వాసన చూడడం వల్ల కూడా ముక్కులో నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. అయితే చిన్న పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉన్నప్పుడూ విటమిన్ ఇ క్యాప్సిల్స్ లో కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలిపి రెండు లేదా మూడు చుక్కలు ముక్కు రంధ్రల్లో వేస్తే త్వరగా ఈ సమస్య తగ్గిపోతుంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ముక్కు లోంచి రక్తం కారడం ఆగకపోతే.. వైద్యుడిని ఉత్తమం.