భారతదేశం సుసంపన్న, శక్తివంతమైన దేశంగా అవతరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం మాట్లాడిన గడ్కరీ.. నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నాకు మరింత శక్తినివ్వాలని ప్రార్థించిన్నట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో దేశం త్వరలో అతిపెద్ద శక్తివంతమైన దేశంగా ఆవిర్భవిస్తుందన్నారు.
Also Read:కాంగ్రెస్ కే క్లారిటీ లేదా?
ఇక తిరుపతి పర్యటనలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిని సందర్శించారు గడ్కరీ. ఇక్కడ అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు ఉన్నాయని, నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చెన్నై, హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇవి ఎంతో ఖర్చుతో కూడుకున్నవని అన్నారు.
Also Read:ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు ‘పోడు’ పట్టాలు..