నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వుంటారు. వాటిలో కొన్ని ఆరోగ్య సమస్యలు అత్యంత ప్రమాదకరంగా మారుతుంటాయి. అయిన వాటిపట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి ఆరోగ్య సమస్యలలో మలంలో రక్తం పడడం కూడా ఒకటి. ఈ సమస్య చాలా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మలంలో రక్తం పడడానికి చాలా కారణలే ఉన్నప్పటికి, దీని పట్ల అజాగ్రత్త వహించడం ప్రాణాలకే ముప్పు అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మలంలో రక్తం ఎందుకు పడుతుంది ? అలా పడడం వల్ల వచ్చే అనార్ధాలు ఏంటి ? ఇలా జరగడం దేనికి సంకేతం ? వంటి వాటి గురించి తెలుసుకుందాం !
సాధారణంగా అన్నవాహిక నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా రక్తస్రావం అయితే అది మలం ద్వారా బయటకు వస్తుంది. కొంతమందిలో మొలలు లేదా ఫిషర్స్ ( మలద్వారం వద్ద చీలికలు ఏర్పడడం ) ద్వారా కూడా మలంలో రక్తం పడుతుంది. ఎదుకంటే మొలల కారణంగా మలాశయం దిగువన సిరాలు ఉబ్బడంతో, మలం బయటకు వచ్చే టైంలో అవి చిట్లిపోయి రక్తం రావడానికి కారణం అవుతుంది. ఇక ఫిషర్స్ లో కూడా ఇంతే మలం గట్టిగా వచ్చేటప్పుడు.. మలద్వారం చుట్టూ ఉండే కణజాలం చిరుకుపోయి రక్తం పడుతుంది. అయితే వీటివల్లనే కాకుండా చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు వంటి వాటిలో సమస్యలు ఏర్పడిన కూడా రక్తం పడుతుంది. .
రక్తం ముదురు రంగులో కాస్త నల్లగా పడితే అది చిన్న పేగు నుంచి ఏర్పడిన సమస్యగా గుర్తించవచ్చు. అలా కాకుండా రక్తం కాస్త పలచగా ఎరుపు రంగులో బయటకు వస్తున్నప్పుడు అది పెద్దప్రేగులో ఏర్పడిన సమస్యగా గుర్తించాలి. పెద్ద ప్రేగులో చిన్న చిన్న తిత్తులు ఏర్పడి, అవి ఉబ్బిపోవడం లేదా చిట్లిపోవడడం, లేదా పేగు పూతా వంటి వాటి వల్ల కూడా మలం ద్వారా రక్తం బయటకు వస్తుంది. అయితే ఎక్కువ శాతం మొలలు, ఫిషర్స్, ఫిస్టులా వంటి సమస్యల కరణంగానే మలంలో రక్తం పడుతుంది. అయితే ఒకవేళ పెద్ద ప్రేగులో సమస్యల కారణంగా మలంలో రక్తం పడితే అది క్యాన్సర్ కు కూడా దారితీయవచ్చు. దీన్ని కొలోన్ క్యాన్సర్ లేదా ప్రేగుక్యాన్సర్ అంటారు. అందువల్ల సమస్య ఏదైనప్పటికి మలంలో రక్తం పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి, సరైన చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..