దేశ వ్యాప్తంగా పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయోగించిన అస్త్రం అనేక మంది నల్లధన కుబేరుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. పెద్ద నోట్ల వ్యవహారంలో కర్నాటక రాష్ట్రంలోని బంగారుపేట ఎమ్మెల్యే ఒకరు తన ఇంట్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీసి, తన నియోజకవర్గ ప్రజలకు రూ.3లక్షలు చొప్పున పంపిణీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ,….తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో ఇంట్లో నల్లధనం ఉన్నట్టు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ హీరో ఇంట్లో ఏకంగా రూ.25కోట్ల నోట్ల కట్టలు ఉన్నట్టు సమాచారం. సినిమా రంగంతో తరతరాలుగా అనుబంధం ఉన్న స్టార్ హీరోకి…బయట పలు రంగాల్లో పెట్టుబడులు, వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఓ బిజినెస్ డీలింగ్‌లో భాగంగా ఇంట్లో రూ.25కోట్ల 1000రూపాయల నోట్ల కట్టలను ఉంచాడట. మరో 2రోజులు ఆగితే ఆ బిజినెస్ డీలింగ్ పూర్తయిపోయేదట.
ఇంతలో ప్రధాని మోడీ ప్రయోగించిన పెద్ద నోట్లు రద్దు ఆ హీరోను నిలువునా ముంచిందట. ఇప్పుడు తన ఇంట్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తెచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడట. ఇప్పుడు దాన్ని ఎలా మార్చాలో తెలియక బుర్రబద్దలు కొట్టుకుంటున్నాడట. తెలుగు రాష్ట్రాలు,… తమిళనాడుల్లో కూడా మంచి వ్యాపార సంబంధాలు ఉండడంతో.. ఈ పెద్ద నోట్లను మార్చేందుకు.. ప్రస్తుతం తనకున్న పాత పరిచయాలు అన్నిటినీ ఉపయోగిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ దెబ్బతో ఆ హీరోకు హార్ట్ఎటాక్ వచ్చినంత పని జరిగిందట.
మరి ఇంత పెద్ద నోట్ల కట్ల సమస్య నుంచి ఆ హీరో గారిని ఎవరు బయట పడేయగలరు ? మంచి క్రేజు ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో లబో దిబో మంటున్నాడు అని ఫిలిం నగర్ లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి.