సాధారణంగా జామకాయలను పోషకాల ఘనిగా అభివర్ణిస్తుంటారు ఆహార నిపుణులు. జామలో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మధుమేహ వ్యాదిగ్రస్తులకు జామ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోదక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాగా సాధారణ జామతో పోల్చితే నల్ల జామలో పోషకాలు ఇంకా అధికంగా ఉంటాయట. నల్లజామలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్ వంటి ఖనిజలతో పాటు విటమిన్ ఏ, సి, కె మరియు బి కాంప్లెక్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి..
వీటితో పాటు ఐరన్ శాతం కూడా ఇందులో ఎక్కువే. కాబట్టి మధుమేహం, రక్త హీనత వంటి సమస్యలతో బాధపడే వారు నల్లజామ తినడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. నల్లజామను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. ఇంకా రక్తం తక్కువగా ఉన్నవారు నల్లజామను వారి ఆహార డైట్ లో చేర్చుకుంటే రక్త కణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా జీర్ణక్రియ మెరుగు పడుతుందట.
మలబద్దక సమస్యతో బాధపడే వారు ఈ నల్ల జామను ఖచ్చితంగా తినాలని చెబుతున్నారు నిపుణులు. ఇది మలబద్దకాన్ని తగ్గించి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుందట. ఇంకా ఈ నల్లజామ తినడం వల్ల మెదడు చురుకుదనం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ, జుట్టు సమస్యలను తగ్గించడంలోనూ నల్లజామ ఎంతగానో ఉపయోగ పడుతుందట. కాబట్టి ప్రతిరోజూ నల్లజామను ఆహార డైట్ లో చేర్చుకోవాలని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు.
Also Read:సిలిండర్ ధరలపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రం