నల్ల ద్రాక్షతో గుండె జబ్బులకు చెక్!

57
- Advertisement -

ద్రాక్ష పళ్లలో చాలానే రకాలు ఉన్నాయి. చిన్న ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష.. ఇలా రకరకాల ద్రాక్ష పళ్లను మనం చూస్తుంటాము. మన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి రోజు ద్రాక్ష పళ్ళు తినాలని వైద్యులు కూడా సలహా ఇస్తుంటారు. ముఖ్యంగా నల్ల ద్రాక్ష తినే విషయంలో కొందరు నిర్లక్ష్యం చూపుతుంటారు. ఎందుకంటే ఇతర ద్రాక్ష పళ్లతో పోల్చితే నల్ల ద్రాక్ష కొద్దిగా పులుపు, వగరు, కాస్త తీపి కలిగి ఉంటుంది. అందువల్ల పులుపును ఇష్టపడని వారు నల్ల ద్రాక్ష తినడానికి ఆసక్తి కనబరచరు. అయితే దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, ఏ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవన్నీ ఇంకా మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి మూలకాలతో పాటు లూటీన్, జియాక్శాంటిన్ వంటి కెరోటినాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి..

ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల ద్రాక్షలో గుండె సమస్యలను దూరం చేసే గుణాలు అధికంగా ఉంటాయట. ఇందులోని రెస్వెరాట్రాల్స్, క్వెర్సిటిన్ అనే రెండు యాక్సిడెంట్లు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా నిరోదిస్తాయట. ఇంకా జుట్టు రాలడం, అధికంగా తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలతో బాధపడే వారు నల్ల ద్రాక్ష తింటే మంచిది. ఇందులోని విటమిన్ ఇ జుట్టు సంరక్షణకు తోడ్పడుతుందని పలు అధ్యయనల్లో వెల్లడైంది. ఇంకా జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా నల్ల ద్రాక్షలోని పోషకాలు ఉపయోగ పడతాయి. అంతే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచూ నల్ల ద్రాక్ష తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ..మిరాయ్

- Advertisement -