ఏపీలో అధికార వైసీపీ మరియు బీజేపీ మద్య అంతర్గత సత్సంబంధాలు ఉన్నాయని ఎన్నో రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా వార్తలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. పలు మార్లు జగన్ ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలవడం, అలాగే సిఎం జగన్ కూడా పలు సందర్భాల్లో మోడి సర్కార్ పై ప్రశంశలు కురిపిస్తూ పలు కార్యక్రమాలకు మోడిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వంటివి చూస్తే బీజేపీ వైసీపీ మద్య రహస్య సంబంధాలు ఉన్నాయనే సందేహం అందరిలోనూ కలుగుతుంది. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. అయితే తాజా పరిణామాలను చూస్తే వైసీపీతో బీజేపీ దూరం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది.
Also read: Pawan:తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
వైఎస్ వివేకా హత్య విషయంలో ఇటీవల భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే కేంద్రం ఆదేశాలు లేనిదే కాలుకూడా కదపని కేంద్ర దర్యాప్తు సంస్థలు.. భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ కేంద్రం ప్రమేయం లేకుండానే అరెస్ట్ చేసిందా ? అనే డౌట్ రాకమానదు. అయితే మొన్నటి వరకు జగన్ సర్కార్ కు అండగా నిలుస్తూ వచ్చిన కేంద్రం ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత వైసీపీకి దూరం పటిస్తున్నట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి గట్టిగానే షాక్ ఇచ్చారు పట్టభద్రులు. దాంతో జగన్ తో స్నేహంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం బీజేపీపై కూడా పడుతుందనే భావనతోనే భాస్కర్ రెడ్డి అరెస్ట్ విషయంలో కేంద్రం చూసి చూడనట్లుగా వ్యవహరించిందని ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also read: జనసేనలో అంతర్మథనం.. అందుకే ఆ నిర్ణయం!
మొత్తానికి తాజా పరిణామాలు చూస్తే వైసీపీకి దూరంగా ఉండేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా ఏపీ బీజేపీ కొ ఇన్ చార్జ్ సునిల్ ధియోధర్ వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో వైసీపీకి బీజేపీకి మద్య అనధికార మైత్రి కొనసాగుతుందనే వార్తలు వస్తున్నాయని, వైఎస్ వివేకా హత్యలో తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడంతో అలాంటి వార్తలకు చెక్ పడినట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని అలాంటి రౌడీ పాలన ఉన్న పార్టీతో బీజేపీ అతర్గత పొత్తులో ఉండే ప్రసక్తే లేదని సునిల్ ధియోధర్ అన్నారు. మొత్తానికి వివేకా హత్య కేసుతో వైసీపీని బీజేపీ వదిలేసినట్లే కనిపిస్తోంది.