మునుగోడులో బీజేపీ గుండాయిజం..టీఆర్‌ఎస్‌పై దాడి

147
- Advertisement -

మునుగోడులో మరికొన్ని గంటల్లో ఉప ఎన్నిక ప్రచార సమయం ముగుస్తున్న వేళ బీజేపీ కార్యకర్తలు గుండాయిజంను ప్రదర్శించారు. మునుగోడు మండలం పలివెల గ్రామంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోకి వెళ్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై రాళ్లదాడి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సమక్షంలో ఈ దాడికి తెగబడ్డారు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ గుండాలు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నాయకులపై కర్రలతో రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్‌, జిల్లా టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు కుసుమ జగదీష్‌, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

కారుదే గెలుపు..ఆర్ఎస్ఎస్ షాకింగ్ సర్వే!

గ్యాస్‌కు దండం పెట్టి…కారుకు ఓటేయండి

రాహుల్‌కు కేటీఆర్ చురకలు..

 

- Advertisement -