బీజేపీ ఖాతాలోకి సూరత్..ఏకగ్రీవం!

20
- Advertisement -

టార్గెట్ 400 పేరుతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతోంది బీజేపీ. ఇక ఇప్పటికే తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా అప్పుడే ఖాతా తెరచింది బీజేపీ. సూరత్ లోక్ సభ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థి.

కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కాగా.. పోటీలో ఉన్న మిగితా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సూరత్ లోక్‍‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున నామినేషన్ వేసిన మకేశ్ భాయ్ దలాల్ ఒక్కరే పోటీలో నిలిచారు. దీంతో సూరత్ లోక్‌సభ నియోజకవర్గం ఏకగ్రీవం అయింది. అయితే దీనిపై ఎన్నికల సంఘం అధికారులు.. ప్రకటన చేయాల్సి ఉంది.

Also Read:వేసవిలో రాగిజావా.. ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -