ధరణి పోర్టల్ విషయంలో బీజేపీది పూటకో మాట మాట్లాడుకుంటున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీంతో బీజేపీ వైఖరి బయటిపడిందని తెలిపారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు ట్వీట్టర్ వేదికగా…గల్లి బీజేపీ నాయకులు ఒకటి చెప్తే ఢిల్లీ నాయకులు ఇంకొకటి చెప్తారు. ధరణిని రద్దు చేయబోమని మొన్న రాష్ట్ర నాయకులు చెప్తే నిన్న నడ్డా వచ్చి ధరణిని రద్ధు చేస్తామని చెప్పడం…బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరొక నిదర్శనమన్నారు. బీజేపీ పార్టీలో నేతల మధ్య సుతి కలవదు, ఒకరి మాట మరొకరు వినరు అని హరీశ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా, గుడ్డిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read: రాహుల్ నాయకత్వంపై డౌటే ?
ధరణి పోర్టల్ విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట.
గల్లీ బీజేపీ నాయకులు ఒకటి చెప్తే, ఢిల్లీ నాయకులు ఇంకొకటి చెప్తారు.
ధరణిని రద్దు చేయబోమని మొన్న రాష్ట్ర నాయకులు అంటే, రద్దు చేస్తామని నిన్న నడ్డా అన్నడు.
బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరొక నిదర్శనం.
బీజేపీ పార్టీలో నేతల…
— Harish Rao Thanneeru (@BRSHarish) June 26, 2023