బీజేపీ.. ఏంటి ఈ కన్ఫ్యూజన్ ?

60
- Advertisement -

ప్రస్తుతం ఏపీలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అందరిని కన్ఫ్యూజన్ కు లోనయ్యేలా చేస్తోంది. ఏపీలో మొదటి నుంచి కూడా జనసేన పార్టీతో పొత్తులో ఉన్న కాషాయ పార్టీ పరోక్షంగా వైసీపీతో కూడా సక్యతగానే మెలుగుతూ వచ్చింది. కానీ టీడీపీకి మాత్రం దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడేమో వైసీపీపై నిప్పులు చెరుగుతూ టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. దీంతో అసలు ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి అనేది అర్థం కాక విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గద్దె దించాలంటే కూటమి తప్పనిసరి అని భావించిన టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు దిశగా అడుగులు వేశాయి..

ఇప్పుడు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసేందుకు సిద్దమైనట్లే తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా కూటమికి సంబంధించిన ప్రతిపాదనను చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దల ముందు ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీ పెద్దలు వైసీపీపై నిప్పులు చెరగడంతో కూటమికి బీజేపీ సై అన్నట్లే అని వాదన నడిచింది. కానీ తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ” తమ పొత్తు జనంతోనే అని అనడంతో కొత్త చర్చకు తావిచ్చినట్లైంది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ సిద్దమైందా అనే అనుమానం రాక మానదు.

Also Read: బి‌ఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?

మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన టీడీపీ వైపు వెళితే ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా సిద్దమే అని ఆ మధ్య బీజేపీ క్లారిటీ ఇచ్చింది. కానీ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే నష్టమే తప్పా ఎలాంటి లాభం ఉండదు. అందుకే మళ్ళీ పొత్తుల విషయంలో పునః ఆలోచనలో పడ్డ బీజేపీ.. మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సంగతి అటుంచి కనీసం డిపాజిట్లు కూడా రావనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి బీజేపీ అందరిని కన్ఫ్యూజ్ చేస్తోందో ? లేదా కన్ఫ్యూజన్ లో పడిందో ? అర్థం కానీ పరిస్థితిలో ఆ పార్టీ ఉందనే చెప్పవచ్చు.

Also Read: కే‌సి‌ఆర్ పథకాలే దిక్కు అంటున్న బీజేపీ !

- Advertisement -