Revanth Reddy:రేవంత్ రెడ్డికి బీజేపీ ఆహ్వానం?

50
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు హాట్ హాట్ చర్చలకు తావిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే కర్నాటక ఫలితాల ప్రభావం ఈ రెండు పార్టీలపై గట్టిగానే చూపిందనే చెప్పాలి. కర్నాటక ఎన్నికల్లో గెలిచిన జోష్ లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఓటమితో బీజేపీ డీలా పడిపోయింది. దీంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల దృష్టి తెలంగాణపై పడింది. నిన్నమొన్నటి వరకు రాష్ట్రంలో జోరు చూపించిన బీజేపీ.. ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ విన్నింగ్ కొనసాగించేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలోని పలువురు నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నట్లు వ్యాఖ్యానించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలిటికల్ హీట్ కు తెరతీశారు.

Also Read:కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

గతంలో పార్టీ విడిచిన వాళ్ళు తిరిగి పార్టీలోకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఈటెల రాజేంద్ర వంటి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో ఈ నేతలు పార్టీ మారతారా అనే ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో బాగానే చక్కర్లు కొట్టాయి. ఎందుకంటే బీజేపీలో చేరి చాలా రోజులౌతున్నప్పటికి ఈటెల రాజేంద్ర, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారికి సరైన ప్రదాన్యం దక్కలేదనే విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. దీంతో ముఖ్యంగా ఈటెల రాజేంద్ర వంటి బలమైన నేత పార్టీ మారే ఆలోచనలో ఉన్నరనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

Also Read:సీఎం ఆఫర్.. ఎన్టీఆర్ మాత్రం నో

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రత్యకంగా పేర్లు ప్రస్తావిస్తూ ఈటెల, కోమటిరెడ్డి వంటివారికి కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరుస్తోందని చెప్పడంతో ఇన్ సైడ్ లో పార్టీ పిరాయింపులకు తెర లేచిందా అనే డౌట్ చక్కర్లు కొడుతోంది. అయితే తాము పార్టీ మారడం లేదని బీజేపీతోనే ఉంటామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటెల రాజేంద్ర ఇటీవల స్పష్టం చేశారు. దీంతో నేతలను ఆకర్శించేందుకు కాంగ్రెస్ ఆడుతున్న మైండ్ గేమ్ అని రాజకీయవాదులు చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తూ కమలనాథులు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ తాము ఏ పార్టీ మారడం లేదని.. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీ మారితే బీజేపీలో సరైన ప్రదాన్యం కలిపిస్తామని కమలనాథులు చెబుతున్నారు. మొత్తానికి ఇలా బీజేపీ, కాంగ్రెస్ ల మద్య ఆహ్వాన పిలుపులు హాట్ టాపిక్ గా మారాయి.

- Advertisement -