కాళేశ్వరం క్రెడిట్.. ఎవరిది?

35
- Advertisement -

సొమ్మొకరిది సోకొకరిది అనే సామెత వినే ఉంటారు.. ఈ సామెత కేంద్ర ప్రభుత్వానికి అతినట్లు సరిపోతుంది. తెలంగాణ విషయంలో మొదటి నుంచి కూడా చిన్నచూపు వహిస్తున్న కేంద్రం.. ఇక్కడ జరిగిన అభివృద్దిని మాత్రం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అన్నీ రంగాల్లోనూ తెలంగాణ అగ్రపథంలో దూసుకుపోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ తన విజన్ తో తన పాలన దక్షతతో తెలంగాణను చాలా రంగాల్లో దేశంలోనే నెంబర్ ఒన్ స్టేట్ గా నిలబెట్టారు.

హయ్యెస్ట్ తలసరి ఆదాయం లభిస్తున్న రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక జాబ్స్ క్రియేట్ చేస్తున్న రాష్ట్రంగా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర రాష్ట్రాలకు సాధ్యంకాని ఎన్నిటినో తెలంగాణలో సాధ్యం చేసి చూపించారు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకోవాలని కేంద్రం ప్రయత్నించడం నిజంగా సిగ్గుచేటు అనే చెప్పవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పట్ల ఎప్పుడు చిన్న చూపు వహిస్తూనే ఉంది కేంద్రం.

Also Read:ఎండు ద్రాక్ష.. ఆరోగ్యానికి ఎంతో మేలు !

నిధులు మంజూరు చేయడంలోనూ, కేంద్ర పరిశ్రమలను స్థాపించడంలోనూ తెలంగాణ వైపు చూసిందేలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేంద్రప్రభుత్వం రూ. 86 వేల కోట్లు ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తాజాగా లోక్ సభలో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను బట్టే అర్థమౌతోంది బీజేపీ నేతల వంకరబుద్ది. కమలనాథుల కల్లబొల్లి కబుర్లు హాస్యాస్పదంగా ఉన్నాయే తప్పా.. వాస్తవాలకు దగ్గరలేవనే సంగతి తెలంగాణ ప్రజానీకానికి బాగా తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్న నిధులతో కే‌సి‌ఆర్ పట్టుదలతో ప్రాజెక్ట్ పూర్తి అయిందనే సంగతి కేంద్రానికి కూడా తెలుసు అయినప్పటికి క్రెడిట్ తమ కథలో వేసుకోవాలని చూస్తోంది మోడి సర్కార్. లోక్ సభ వేధికగా బీజేపీ నేతలు చేస్తున్న ఈ తప్పుడు ప్రకటనలు నిజంగా సిగ్గుచేటు అనే చెప్పుకోవాలి.

Also Read:షర్మిల కండిషన్స్.. పాలేరు కోసమే?

- Advertisement -