ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం!

281
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికలొ టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలనే బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎర జూపి కొనుగోలు చేసేందుకు యత్నించింది. అయితే బీజేపీ వేసిన స్కెచ్ దెబ్బతింది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు స్కేచ్ వేయగా… దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

పట్టుబడిన వారిలో బీజేపీ నేతలు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌ ఉన్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్‌లోని పీవీఆర్ ఫామ్ హౌస్‌లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ లోని ఫాం హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. వీరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం.. పూర్తివివరాలు దర్యాప్తు తర్వాత బయటపడతాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపారు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని చెప్పినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.

- Advertisement -