కర్నాటకలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ సారి అధికారం కాంగ్రెస్ పార్టీకి దక్కకపోవచ్చని అంటుంది ఓ సర్వే. కర్నాటకలో ఇప్పటి వరకు అనేక సర్వేల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్పష్టంచేశాయి. కానీ ఈ సర్వేలో మాత్రం గత సర్వేలకు భిన్నంగా కర్నాటకలో అధికారం బీజేపీ ఛేజిక్కించుకుటుందని చెబుతుంది.
ఇది అంత ఖచ్చితమైన సర్వేనా అనే ప్రశ్న మీకు రావచ్చు. అవును నిజంగానే ఖచ్చితమైన సర్వేనని అంటున్నారు కొందరు రాజకీయ నాయకులు. గత రాష్ట్రాల ఎన్నికల్లో ఈ సర్వే ఫలితాలు ఖచ్చితత్వానికి మారుపేరుగా నిలిచాయట. ఇంతకు ఈ సర్వే ఎక్కడిదంటారా..? ఓ రాజకీయ నాయకుడు, ఓ సెఫాలజిస్టు కలిసి చేసే ఈ సర్వేలో గతంలోనూటికి నూరు శాతం ఫలితాలను అందించినట్లు సమాచారం. వీరిద్దరి కలయికలో అనేక సర్వేలు నిర్వహించటంతో వారు చెప్సిందే నిజమైందని భావిస్తున్నారు రాజకీయ నాయకులు. సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్, రాజకీయ నాయకుడు లగడపాటి రాజుగోపాలే ఈ సర్వే నిర్వాహకులని అనుకుంటున్నారు విశ్లేషకులు.
ఈ సర్వే ప్రకారం కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 224 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 110-120 సీట్లు, కాంగ్రె్‌సకు 70-80 సీట్లు, జనతాదళ్ (ఎస్)కు 40 సీట్ల వరకు వస్తాయని సర్వేలో తేలినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇటీవల సర్వేలో మాత్రం మరోసారి కాంగ్రెస్ అధికార పగ్గాలు చేజిక్కించుకుంటుందని అనేక సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. కానీ ఈ సర్వే ఫలితాలతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భారతదేశంలో ఒక్కొక్కటిగా అన్ని రాష్ట్ర్రాలను కైవసం చేసుకుంటున్న బీజేపీ దక్షిణాధి రాష్ట్ర్ర్రాల్లో కూడా అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతల మధ్య టెంక్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకు ఈ సర్వే ప్రకారం నిజంగానే కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందా ? బీజేపీ నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా? కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఈ నెల 15 వరకు ఆగక తప్పదు.