తమిళ నాడులోని కూనూరు వద్ద ఆర్మి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో సహా.. 13 మంది మరణించారు. తాజాగా హెలికాప్టర్ సంఘటనపై వివాదస్పద రాజ్య సభ సభ్యులు సుబ్ర మణ్య స్వామి ఆస్తకి కర వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్ జడ్జితో విచారణ చేయించాలని …దేశ భదత్రతకు పెద్ద హెచ్చరిక అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ రిపోర్టు రాలేదని.. కాబట్టి ఏదైనా చెప్పడం చాలా కష్టంగా ఉంది.. కానీ వాస్తవం ఏమిటంటే తమిళనాడు లాంటి సేఫ్ జోన్ లో ఉన్న మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ పేలడం ఆశర్యకరం అని సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు.
హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయి. ఘటనా స్థలికి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ దొరకగా హెలికాప్టర్ కూలే ముందు పైలెట్, కో పైలెట్ ఆడియోలు రికార్డ్ అయ్యుండే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్ డీకోడ్ చేశాక ప్రమాదానికి సంబంధించి కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.