తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు..

30
harish

డిసెంబర్ 9 ఇవాళ తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజన్నారు మంత్రి హరీష్ రావు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షాదక్షుడి నాయకత్వంలో..ఉద్యమం విజయతీరాలకు చేరిన రోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలిపిన రోజు.తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో…!అన్న ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి తో పన్నేడేండ్లు. అని మంత్రి హరీశ్‌ రావు ట్విటర్‌లో పోస్టు చేశారు.

2009, నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రరంభించారు. దీంతో ఉద్యమ తీవ్రత రోజురోజుకు అధికమవుతుండటంతో.. డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే.