దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కల అయినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణ ఘట్టం, రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్. రామ భక్తుల 500 ఏళ్ళ పోరాటం ఫలించడంతో నిజంగా నోటి వెంట మాట కూడా రావడం లేదని ఆయన తెలిపారు. రథయాత్రతో అయోధ్య పోరాటానికి నాంది పలికిన ఎల్ కే అద్వానీ, విశ్వ హిందూ పరిషత్ సహా సంఘ్ పరివార్ అన్నారు.
ఆ తర్వాత ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఏ ఒక్కరి పాత్రను తక్కువ చేసి చూడలేము. కరసేవకుల త్యాగాలనైతే అస్సలు విస్మరించలేము. నేటి అద్భుతఘట్టం ఆవిష్కృతమైన క్షణాలను మాటల్లో వర్ణించలేను. ఆ శ్రీరాముడే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని పిలిపించుకున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. 11 రోజుల పాటు కఠోర దీక్షతో మోదీ, తనకు రాములోరు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేశారు.
అయోధ్య రామ మందిర అంశంలో అనవసర ఆరోపణలు ఎదుర్కొన్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు , నేటి అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి ఉంటే ఎంతో సంతోషించే వారు. అయినప్పటికీ, ఈ క్రతువుని చూసి, ఆయన ఆత్మ శాంతించిందని నేను అనుకుంటున్నాను. ఆయన మనుమడిగా పుట్టడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. మొత్తానికి అయోధ్యలో రామయ్య కొలువుతీరడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మతాలకతీతంగా జరుపుకున్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రత్యేకించి, ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ముస్లీం సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు.
Also Read:Nagarjuna: నాగార్జున ఊపిరి పీల్చుకున్నట్టే