టీబీజేపీ నేతలపై రాజాసింగ్ సంచలనం

1
- Advertisement -

ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన ముఖ్య నేతలకు చోటు దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, వర్గపోరే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బీజేపీ నాయకత్వ తీరుపై రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనూ, పార్టీ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఐక్యత లోపించిందని, ఒకరిపై ఒకరు నిరంతరం ఢిల్లీలోని అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి ఎక్కువైందని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్ర నేతలు మారరు, వారి గ్రూపు రాజకీయాలు వీడరు అనే భావనకు జాతీయ నాయకత్వం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అందుకే తెలంగాణ నేతలను పక్కనపెట్టి ఇతర రాష్ట్రాల నాయకులకు జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు వ్యక్తిగత విభేదాలను, గ్రూపు రాజకీయాలను పూర్తిగా పక్కనబెట్టాలని రాజాసింగ్ హితవు చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీకి, రాష్ట్రానికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకుల మధ్య ఉన్న వర్గపోరు పార్టీ ప్రతిష్టను దిగజార్చుతోందని, అధిష్టానం నిర్ణయం ద్వారా అయినా నాయకులు గుణపాఠం నేర్చుకోవాలని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు.

Also Read;ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!

- Advertisement -