రఘునందన్‌ నిజస్వరూపం బట్టబయలు…!

151
raghunandanrao
- Advertisement -

కల్లబొల్లి మాటలు నమ్మి, నోట్ల కట్టల డ్రామాలకు లొంగిపోయి..మూడు సార్లు ఓడిపోయాడన్న అన్న సింపతీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించిన దుబ్బాక ప్రజలకు ఇప్పుడు అసలు సీన్ ఏంటో అర్థమవుతోంది. రఘునందన్‌రావు రాజకీయ నాయకుడి ముసుగులో ఉన్న కామాంధుడని, టాలీవుడ్‌‌ ప్రముఖులకు అమ్మాయిలు సప్లై చేసే బ్రోకర్ అని ఆరోపణలు వచ్చినా దుబ్బాక ప్రజలు పట్టించుకోలేదు.

ఇక ఎన్నికల టైమ్‌లో సిద్ధిపేటలో నోట్ల కట్టల డ్రామాతో తనను టీఆర్ఎస్ ప్రభుత్వం హెరాస్ చేస్తుందని అంటూ సింపతీ క్రియేట్ చేసుకున్నాడు. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు, రైతుబంధు, డబుల్ బెడ్‌రూం ఇండ్లు వంటి పథకాలకు, ఆఖరకు మరుగుదొడ్లకు కేంద్రమే నిధులు ఇస్తుందంటూ అబద్ధపు ప్రచారం చేసాడు. దీంతో దుబ్బాక ప్రజలు రఘునందన్‌రావు కల్లబొల్లి మాటలను నమ్మి గెలిపించారు. అయితే ఇప్పుడు రఘునందన్‌రావు అసలు నైజం ఏంటో దుబ్బాక ప్రజలకు తెలిసివస్తోంది. గెలిచిన దగ్గర నుంచి సన్మానాలు, ప్రైవేట్ ఫంక్షన్లు, బర్త్‌‌డే పార్టీలతో ఎంజాయ్ చేయడం తప్పా..ప్రజల గురించి ఇంతవరకు రఘునందన్‌రావు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఓ పెద్దాయనకు పింఛన్ ఇప్పించలేక మంత్రి హరీష్‌రావు చచ్చిపోవాలని ఇంటికి వెళ్లి మొక్కుకోపో అంటూ రఘునందన్‌రావు చిందులు వేశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు నిజస్వరూపాన్ని ఆ వృద్ధుడు ఆ వీడియోలో వివరించాడు.వివరాల్లోకి వెళితే దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధుడు గత కొన్నాళ్లుగా పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.

అయితే అధికారులు మాత్రం రేపు,మాపు అంటూ ఆయన్ని తిప్పుతున్నారు. దీంతో ఆ పెద్దాయన స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఆశ్రయించాడు. సార్..నాకు పింఛన్ వస్తలేదు కాస్త ఇప్పించండి అంటూ వేడుకున్నాడు. అయితే ఎమ్మెల్యేగా అధికారులతో మాట్లాడి పింఛన్ ఇప్పించాల్సిన రఘునందన్‌రావు ఆ పని చేయలేదు. పైగా హరీష్‌రావు ఉన్నంత వరకు నీకు పింఛన్ రాదు..ఇంటికి పోయి హరీష్‌రావు చచ్చిపోవాలని దేవుడికి మొక్కుకోపో అప్పుడు వస్తది అంటూ ఆ పెద్దాయన పింఛన్ ఫైల్‌ను కిందపడేసి చిందులు వేసాడు. దీంతో అవాక్కైన ఆ పెద్దాయన రఘునందన్‌రావు అసలు బాగోతాన్ని చెబుతూ వాపోయాడు. ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు తీర్చేది పోయి..ఇలా ఒక్క పింఛన్ ఇఫ్పించలేక మంత్రి హరీష్‌రావు చచ్చిపోవాలని దేవుడికి మొక్కుకోపో అంటూ కండకావరం ప్రదర్శించిన రఘునందన్‌రావు తీరుపై దుబ్బాక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -