ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో జరిగిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. సబ్కా సాథ్ నుంచి ఆర్టికల్ 370 రద్దు వరకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ధైర్యవంతమైన సంస్కరణలను వివరించారు. మోదీ పాలన భారత రాజకీయ సంస్కృతిని మార్చిందని, సమగ్ర అభివృద్ధిని సాధించిందని ఆయన పేర్కొన్నారు.
జవాబుదారీతనంతో కూడిన పాలన వైపు మళ్లించామని చెప్పారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ దేశం ముందుకు సాగిందని ఆయన అన్నారు. 11 సంవత్సరాల క్రితం ఓటు బ్యాంకుల రాజకీయాలు, వ్యక్తిత్వ ఆధారిత విభజనలు ఉధృతంగా ఉండేవని, కానీ మోదీ ప్రభుత్వం పారదర్శకతతో కూడిన పాలనకు నాంది పలికిందని నడ్డా వివరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును ప్రస్తావిస్తూ, అది అంతకు ముందు సాధ్యం కానివిగా భావించబడ్డ ఘనతగా అభివర్ణించారు. ఈ చర్యల ఫలితంగా ప్రజాస్వామ్య విధానాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరిగిందని, లోక్‌సభ ఎన్నికల్లో 58.46% మరియు అసెంబ్లీ ఎన్నికల్లో 63% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు.సైన్యంలో మహిళా అధికారుల నియామకం, సైనిక్ స్కూల్‌ల్లో బాలికల ప్రవేశం, లక్షపతి దీది వంటి పథకాల ద్వారా మహిళా వ్యాపారులను ప్రోత్సహించడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర అభివృద్ధి విధానానికి నిదర్శనాలని నడ్డా స్పష్టం చేశారు.
Also Read:రాజకీయాల కోసం నీటి హక్కులను కాలరాయొద్దు

