ఎంపీ జ‌యంత్ సిన్హాకు బీజేపీ నోటీస్..

18
- Advertisement -

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఇప్పటివరకు ఐదు దశల ఎన్నికలు పూర్తి కాగా మరో రెండు దశల పోలింగ్ మాత్రమే మిగిలి ఉంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇక ప్రజలంతా పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిస్తూనే ఉంగా మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ జ‌యంత్ సిన్హా మాత్రం ఈసారి ఓటేయలేదు. దీంతో జయంత్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది బీజేపీ.

పార్టీ కార్య‌క‌లాపాల్లో, ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డం లేద‌ని ఆ ఎంపీపై పార్టీ సీరియ‌స్ అయ్యింది. జార్ఖండ్‌లోని హ‌జారిబాగ్ సీటు నుంచి మ‌నీశ్ జైస్వాల్‌ను ప్ర‌క‌టించ‌డంతో ఎంపీ జ‌యంత్ ప్ర‌చారంలో పాల్గొన‌లేదు. మీరు మీ ఓటును కూడా వేయ‌లేద‌ని, మీ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగింద‌ని బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య సాహూ తెలిపారు. రెండు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలపగా దీనిపై ఆయన స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Also Read:KTR:ప్రజా పాలన కాదు రైతు వ్యతిరేక పాలన

- Advertisement -