భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1980లో ఒక చిన్న రాజకీయ పార్టీగా ప్రారంభమై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడంలో అనేక మంది అధ్యక్షులు కీలక పాత్ర పోషించారు. నితిన్ నబీన్ తాజాగా కొత్త అధ్యక్షుడిగా నియమితులు కాగా బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై, ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. అంతకు ముందు, డిసెంబర్ 15న ఆయన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
1980 నుంచి ఇప్పటివరకు బీజేపీకి అనేక ప్రభావశీల నాయకులు అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రతి అధ్యక్షుడు పార్టీ భావజాలం, సంస్థాగత నిర్మాణం, ఎన్నికల వ్యూహాలను తనదైన శైలిలో మలిచారు. అటల్ బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ప్రారంభ దశల నుంచి నితిన్ నబీన్ వరకూ బీజేపీ ప్రయాణం, పార్టీ ఎదుగుదలకి అద్దం పడుతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుల జాబితా:
అటల్ బిహారి వాజ్‌పేయీ (1980–86)
ఎల్‌కే అద్వానీ (1986–91)
మురళీ మనోహర్ జోషి (1991–93)
ఎల్‌కే అద్వానీ (1993–98)
కుశాభౌ ఠాక్రే (1998–2000)
బంగారు లక్ష్మణ్ (2000–01)
జన కృష్ణమూర్తి (2001–02)
వెంకయ్య నాయుడు (2002–04)
ఎల్‌కే అద్వానీ (2004–05)
రాజ్‌నాథ్ సింగ్ (2005–09)
నితిన్ గడ్కరీ (2009–13)
రాజ్‌నాథ్ సింగ్ (2013–14)
అమిత్ షా (2014–20)
జేపీ నడ్డా (2020–26)
నితిన్ నబీన్ (2026–ప్రస్తుతం)
Also Read:టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదం
నితిన్ నబీన్… బిహార్‌కు చెందిన సీనియర్ బీజేపీ నేత. పాట్నాలో జన్మించిన ఆయన, దివంగత నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా (బీజేపీ ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే) కుమారుడు. తండ్రి అకాల మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన నబీన్, క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, 2006 ఉపఎన్నికతో పాటు 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో వరుసగా ఐదు సార్లు విజయం సాధించారు.

