అల్లు అర్జున్‌పై కేసు చిన్నది:రఘునందన్

3
- Advertisement -

సంధ్య థియేటర్‌లో జ‌రిగిన‌ తొక్కిసలాట ఘ‌ట‌న‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని పెద్ద‌గా చేస్తుంద‌ని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు ఆరోపించారు. అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది. ఇది రాష్ట్రంలోని ఇతర చిన్న కేసుల్లాంటిదేనన్నారు.

ఒక న‌టుడిని అరెస్ట్ చేసి ఈ ఘ‌ట‌న‌లో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం బ్లేమ్ చేస్తుందన్నారు. ఈ కేసుకి సంబంధించి ప్ర‌భుత్వం కావాల‌ని సెన్సేష‌న్ చేస్తుంది… అల్లు అర్జున్‌ని మీడియా ముందుకు రావోద్ద‌ని తెలిపిన పోలీసులు వారు ఎలా మీడియా ముందుకు వ‌చ్చారు అన్నారు. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు నా విన్నపం…. కోర్టు ఇప్పటికే 30 రోజుల బెయిల్ ఇచ్చినందున పోలీసులు ఏ వ్యక్తిపైనా ప్రతీకారం తీర్చుకోకూడదు అన్నారు.

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్ చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

Also Read:నేరెళ్లపల్లికి కేటీఆర్, హరీశ్‌

- Advertisement -