- Advertisement -
బీజేపీ నేత, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఎంపీ కనిపించడం లేదు. ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కనిపించడం లేదని స్ధానిక ప్రజలు పోస్టర్లు వేసి నిరసన తెలిపారు.
భోపాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. దాదాపుగా 1400 కేసులు నమోదుకాగా స్ధానిక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎంపీ…తమను పట్టించుకోవడం లేదని నిరసన తెలియజేస్తూ పోస్టర్లు వేశారు.
ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కమలేశ్వర్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఓటేసే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు. దీంతో స్పందించిన బీజేపీ నేతలు ప్రగ్యా ప్రస్తుతం ఎయిమ్స్ కంటి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమెకు ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతుందని వెల్లడించారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మవద్దని కోరారు.
- Advertisement -