తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

277
telangana rains
- Advertisement -

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి నుండి వర్షం కురుస్తోంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. మరఠ్వాడ, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతుంది.

గాలివాన బీభత్సానికి వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం, తహరాపూర్‌ గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, స్తంభాలు ధ్వంసమయ్యాయి. వర్షానికి ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం గద్వాలతో పాటు దరూర్‌, కెటిదొడ్డి, గట్టు, ఐజలో ఈ తెల్లవారుజామున ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మంచిర్యాల జ్లిలా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. పలు మండలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ధ్వంసమయ్యాయి.

- Advertisement -