బీజేపీలో ‘కొండా’ కలకలం!

5
- Advertisement -

బీజేపీ పార్టీలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా, కార్యకర్తలతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుంది ? చెప్పాలన్నారు. మీకు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ లో చేరండి, బీజేపీ లాంటి రాజకీయ పార్టీలో ఉండే అర్హత మీకు లేదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ రాజకీయ పార్టీ కాదని, దేశభక్తి పేరుతో వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు పార్టీని బలహీనం చేస్తున్నారని తులిసానేజ మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే పార్టీ ఎలా బలపడుతుందని కార్యకర్తలను ప్రశ్నించారు. పైన మోడీ ఇక్కడ నేను ఎలాగు గెలుస్తామని, అధ్యక్ష్య పదవుల కోసం కొట్టుకోవడం కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.

Also Read:సోషల్ మీడియా పోస్టులు..అత్యుత్సాహం వద్దు!

- Advertisement -