పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్ చేసిన ఎంపీ సీఎం రమేష్(వీడియో)

724
Cm Ramesh Dance
- Advertisement -

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుమారుడు రిత్విక్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజ నిర్చితార్థం నిన్న రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్ లో జరిగిన ఈకార్యక్రమానికి దేశ వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా నుంచి దాదాపు 75మంది ఎంపీలు వెళ్ళారు. వీరికోసం ఏకంగా 15 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు.

కొడుకు నిశ్చితార్ధంలో సీఎం రమేష్ చాలా ఎంజాయ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకి భార్యతో కలిసి స్టెప్పులేశారు. అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారు బొమ్మ పాటకు రమేష్ సతీమణితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కొద్ది రోజుల క్రితం సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Bjp mp cm ramesh dances for pawan kalyan attarintiki daredi song

- Advertisement -